Malaysia Masters Tourney : మలేసియా వేదికగా జరుగుతున్న మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ ను ఓడించి.. తొలి వరల్డ్ టూర్ టైటిల్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. కాగా మొదటి నుంచి ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు షట్లర్లు తీవ్రంగా కష్టపడ్డారు.
చివరకు 21-19, 13-21, 21-18తో ప్రణయ్ విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీంతో మలేషియా మాస్టర్స్ పురుషుల సింగిల్స్ (Malaysia Masters Tourney ) లో టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ రికార్డు సృష్టించాడు. అయితే ఇదే టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు, శ్రీకాంత్‌లు నిరాశ పరిచారు. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ లోనే ఓడిపోగా.. స్టార్ షట్లర్ సింధు సెమీ ఫైనల్‌లో ఆమె ఇంటి ముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన జార్జియా చేతిలో సింధు ఓటమి పాలయ్యింది.
🥇🇮🇳 THE GIANT SLAYER! Prannoy HS brings home the gold after an intense battle against Weng Hong Yang of China at the Malaysia Masters 2023.
🎉 Congratulations, Prannoy!
📷 BFW• #MalaysiaMasters2023 #IndiaontheRise #Badminton #BharatArmy pic.twitter.com/DYJ1XCMGop
— The Bharat Army (@thebharatarmy) May 28, 2023