Site icon Prime9

Zakir Naik: ఫిఫా ప్రపంచ కప్.. ఖతర్ లో జాకీర్‌ నాయక్‌ ప్రసంగాలు

Zakir Naik

Zakir Naik

FIFA World Cup 2022: వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్‌ నాయక్‌ ప్రస్తుతం ఖతర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఖతర్‌లో జరిగే 2022 ఫిఫా వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఆయన టోర్నమెంట్‌ జరిగినన్ని రోజుల పాటు మతపరమైన ప్రసంగాలు కొనసాగిస్తాడు. భారతదేశంలో మనీలాండరింగ్ మరియు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అనేక కేసులను ఎదుర్కొంటున్న జాకీర్ నాయక్‌ను ఫిఫా ప్రపంచ కప్ సందర్బంగా ఇస్లాం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతర్ ఆహ్వానించింది.

ముస్లిం మత ప్రవక్త జాకీర్‌ నాయక్‌పై ఇండియాలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ఇండియా నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకుంటున్నాడు. ప్రస్తుతం ఖతర్‌లో ఫిపా వరల్డ్‌ కప్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఖతర్‌ రాజవంశీకులు ఆయనను ఖతర్‌కు ఆహ్వానించారు. టోర్నమెంట్‌ జరిగినన్ని రోజుల పాటు మతపరమైన ప్రసంగాలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు ప్రభుత్వరంగానికి చెందిన స్పోర్ట్స్‌ ఛానల్‌ అల్కాస్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

జాకీర్‌ నాయక్‌ స్థాపించిన ఇస్లామిక్‌ రీసెర్చి ఫౌండేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) చట్ట వ్యతిరేక కార్యకాలాపాలు సాగిస్తున్నందుకు ఐదు సంవత్సరాల పాటు నిషేధిస్తూ ఈ ఏడాది మార్చిలో హోంమంత్రిశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు తన ప్రసంగాల ద్వారా యువతను టెర్రరిజంపై ఆకర్షించేలా చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో పాటు యువతను బలవంతంగా ఇస్లాం మతంలోకి మత మార్పిడిలు చేయించినట్లు అభియోగాలున్నాయి. ఆత్మాహుతి దాడులను సమర్థించారు నాయక్‌. అలాగే హిందూ దేవుళ్లు, దేవతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాలను కించపరుస్తూ ప్రసంగాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

 

Exit mobile version