Site icon Prime9

WPL 2023: ఆర్‌సీబీకి తప్పని నిరాశ.. ఓటమితో ముగింపు

mumbai

mumbai

WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీకి వరుస ఓటములు వెంటాడాయి. ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్‌ విజయంతో ముగిస్తే.. ఆర్‌సీబీ మాత్రం ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తులు ఖరారు కావడంతో మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

వరుస ఓటములు.. (WPL 2023)

వుమెన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ వరుస ఓటములను ఎదుర్కొంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా.. ఈ మ్యాచ్ కి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక లీగ్ చివరి మ్యాచ్ లో అయిన విజయం సాధిద్దామనుకున్న ఆ జట్టును నిరాశ తప్పలేదు. ఆర్సీబీ విధించిన 129 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

తొలి వికెట్‌కు హేలీ మాథ్యూస్‌(24 పరుగులు), యస్తికా బాటియా(30 పరుగులు) 50 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్‌ అవ్వడం.. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్‌సీబీ ట్రాక్‌ ఎక్కినట్లే కనిపించింది. కానీ అమేలియా కెర్‌(31 నాటౌట్‌).. పూజా వస్త్రాకర్‌(19 పరుగులు) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి జట్టును గెలిపించింది.

ఆర్‌సీబీ బౌలింగ్‌లో కనికా అహుజా రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక్‌ పాటిల్‌, ఎల్లిస్‌ పెర్రీ, మేఘన్‌ స్కా్ట్‌, ఆశా శోభనా తలా ఒక వికెట్‌ తీశారు.

ఈ విజయంతో హర్మన్‌ సేన 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో టాప్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇక ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకున్న ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ వుమెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్‌ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది.

ఎల్లిస్‌ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్‌ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు.

ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ బౌలర్లలో అమెలియా కెర్‌ మూడు వికెట్లు తీయగా.. నట్‌-సివర్‌ బ్రంట్‌ రెండు, ఇసీ వాంగ్‌, సయికా ఇషాకీ చెరొక వికెట్‌ తీశారు.

Exit mobile version