Site icon Prime9

Deepika Padukone : ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించనున్న దీపికా పదుకొణె

Deepika Padukone

Deepika Padukone

FIFA World Cup trophy: డిసెంబర్ 18న ఖతార్‌లో జరిగే ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారని సమాచారం.దీపికా త్వరలో ఖతార్‌కు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారని, ఫిఫా చరిత్రలో అలా చేసిన మొట్టమొదటి భారతీయ నటుడిగా అవతరించనుందని దీపిక సన్నిహిత వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై దీపిక నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.దీపిక ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యులలో ఒకరిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ’ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన మహిళల జాబితాలో ఆమె ఏకైక భారతీయురాలు కావడం విశేషం. దీపిక త్వరలో షారుఖ్ ఖాన్ మరియు జాన్ అబ్రహంతో కలిసి పఠాన్‌లో కనిపించనుంది. ఆమె ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సర్కస్ చిత్రాల్లో నటిస్తోంది.ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రీక్వార్టర్ రౌండ్ బుధవారం ముగియనుంది. ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన జట్లు డిసెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

Exit mobile version
Skip to toolbar