Site icon Prime9

West Indies: టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్

west indies left from t20 world cup

west indies left from t20 world cup

West Indies: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. నేడు జరిగిన కీలకమైన క్వాలిఫయర్స్ మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీనితో ఈ టోర్నీలో కరేబియన్ల కథ ముగిసిపోయి ఇంటి ముఖం పట్టారు.

మొదట టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులోని కీలక బ్యాటర్లు అయిన కింగ్, చార్లెస్, ఒడియన్ స్మీత్ రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కాగా ఐర్లాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో కరేబియాన్ ఆటగాళ్లు తడబడ్డారు. బంతిని బౌండరీకి తరలించడంతో వెస్టిండీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. గౌరవప్రదమైన స్కోర్ చేసిప్పటికీ అది ఐర్లాండ్ జట్టు ముందు చిన్నబోయింది.

బ్యాటర్లు విఫలం..

కరేబియన్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జన్సన్ చార్లెస్ 18 బంతుల్లో 24 పరుగులు చేయగా, ఒడియన్ స్మీత్ 19 పరుగలు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ 4 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ చెరో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు.

అలవోకగా గెలిచేశారు..

147 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఓపెనర్లు అలవోకగా కరేబియన్ బౌలర్లను ఎదుర్కొంటు బంతులను బౌండరీలు చేర్చారు. 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఈజీగా లక్ష్యాన్ని ఛేధించారు. పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలువగా, వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ 35 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇలాంటి కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్లో ఓడిపోయిన కరేబియన్ జట్టు కథ ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇక ముగిసిపోయింది. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్ గా నిలిచిన వెస్టిండీస్ ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీకి కనీసం అర్హత కూడా సాధించలేక పోవడం గమనార్హం.

ఇకపోతే గ్రూప్ ఎ నుంచి ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్-12కు చేరుకున్నాయి. ఇదే గ్రూప్ నుంచి తాజాగా వెస్టిండీస్ పై గెలిచిన ఐర్లాండ్ సూపర్-12 కూడా వెళ్లింది. ఇకపోతే స్కాట్లాండ్, జింబాబ్వే జట్లలో ఏ జట్టు గెలుస్తే ఆ జట్టు సూపర్-12కు వెళ్తుంది. కాగా శనివారం నుంచి సూరప్-12 మ్యాచ్ లు ప్రారంభ కానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది మరియు ఆదివారం నాడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత్ పోటీ పడనుంది.

ఇదీ చదవండి: స్లో ఓవర్ రేటుకు చెక్.. ఆసిస్ ఐడియా అదిరింది..!

Exit mobile version