Site icon Prime9

Virat Kohli: దేశంలో దీపావళి షాపింగ్ ను అడ్డుకున్న విరాట్ కోహ్లి

Virat Kohli

Virat Kohli

Virat Kohli Effect On Shopping: ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్ కొంత సమయం పాటు ఆన్‌లైన్ షాపింగ్ ను నిలిపివేసినట్లు ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ షేర్ చేసిన గ్రాఫ్ తెలిపింది. పగటిపూట ఆన్‌లైన్ లావాదేవీలను ట్రాక్ చేసే గ్రాఫ్, భారత్ బ్యాటింగ్ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు ఆగిపోయాయని మరియు కోహ్లీ అత్యుత్తమంగా ఉన్నప్పుడు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు అది నశించిందని చూపిస్తుంది.

మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ఈ గ్రాఫ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆట ప్రారంభమైన సమయంలో దీపావళి షాపింగ్ రద్దీని చూపుతుంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత, పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు ఆగిపోయాయి. అయితే, భారత్ బ్యాటింగ్ ప్రారంభం కావడంతో అది మరింత క్షీణించడం ప్రారంభించింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా సంఖ్య పడిపోయింది. మరియు ఆట ముగిసినందున, షాపింగ్ తిరిగి ప్రారంభమయింది. “విరాట్ కోహ్లీ నిన్న ఇండియా షాపింగ్‌ను నిలిపివేసాడు!! నిన్న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు యూపీఐ లావాదేవీలు నిలిచిపోయాయి. మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో, ఆన్‌లైన్ షాపింగ్ ఆగిపోయింది. మ్యాచ్ తర్వాత మరలా ప్రారంభమయింది అని వోరా ట్విట్టర్‌లో రాశారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ , పాక్ ల మధ్య జరిగిన మొదటి T20 గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ 159 పరుగుల ఛేదనలోస్కోరు 36 పరుగుల వద్ద ఉన్న సమయంలో మొదటి ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి తడబడింది. కానీ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు మరియు హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేయడంతో మ్యాచ్ ఇండియా అధీనంలోకి వచ్చింది. మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఇది తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటని చెప్పాడు. ఇది నిస్సందేహంగా కోహ్లీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. నీవు ఆడటం చూడటం చాలా ఆనందంగా ఉంది. లాంగ్ ఆన్‌లో రవూఫ్‌ పై 19వ ఓవర్‌లో బ్యాక్‌ఫుట్‌లో సిక్స్ అద్భుతమైనది” అని అతను చెప్పాడు.

 

Exit mobile version