Team India: క్రికెట్ అధికారికంగా ఇంగ్లండ్ దేశపు ఆట అయినా దానికి ఆ దేశంలో ఎంత క్రేజ్ ఉందో తెలియదు కానీ మన ఇండియాలో మాత్రం క్రికెట్ అంటే ఆ అభిమానం ఇంక వేరే లెవల్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా టీం ఇండియా ప్లేయర్లకు అయితే దేశవిదేశాల్లో క్రికెట్ అభిమానులకు కొదవలేదని చెప్పవచ్చు. మరి మనవాళ్లు అదేస్థాయిలో ఆడి అభిమానుల ఆదరాభిమానాలు పొందుతారు. అరుదైన రికార్డులనూ నెలకొల్పుతారు. కాగా తాజాగా టీం ఇండియా మరో చరిత్ర సృష్టించింది. మరి అందేంటో చూసేయ్యండి.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీంఇండియా చరిత్రకెక్కింది. సౌతాఫ్రికాతో నిన్న జరిగిన రెండో వన్డే గెలుపుతో ఈ అరుదైన గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో టీం ఇండియా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందగా.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ విజయంతో 300 విక్టరీ మార్కును కైవసం చేసుకుంది. కాగా ఈ సంఖ్యకు దరిదాపుల్లో కూడా ఏ దేశ క్రికెట్ జట్టూ లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా 257,వెస్టిండీస్ 247 విజయాలు సాధించి తర్వాతి రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: సెంచరితో చెలరేగిన శ్రేయస్ అయ్యర్