Ashes: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు స్మిత్ శతకంతో మెరిశాడు. జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (110) శతకంతో అలరించగా ట్రావిస్ హెడ్ (77), డేవిడ్ వార్నర్ (66) అర్ధశతకాలతో రాణించారు. కాగా ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్ లు చెరో మూడు వికెట్లు తీయగా, జో రూట్ రెండు, జేమ్స్ అండర్సన్, బ్రాడ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టి ఆసీస్ బ్యాటర్లను కట్టడి చెయ్యడానికి ప్రయత్నించారు.
ఓవర్ నైట్ స్కోరు 339/5 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 77 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. ఆట ఆరంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ(22), మిచెల్ స్టార్క్(6), కెప్టెన్ కమిన్స్(22) చేసి పెవిలియన్ చేరారు. ఇక కమిన్స్ అండగా స్మిత్ 169 బంతుల్లో టెస్టుల్లో తన 32 సెంచరీని పూర్తి చేశాడు. శతకం పూరైన కాసేపటికే స్మిత్ ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 393 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు(Ashes)
ఇక స్మిత్ చేసిన తాజాగా శతకం తన టెస్టు కెరీర్‌లో 32వ సెంచరీ. ఈ సెంచరీతో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరుపున అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి స్థానంలో రికీ పాంటింగ్ (41) ఉండగా.. స్టీవ్ వా తో కలిసి స్మిత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
ఇకపోతే ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (51) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్ కలీస్ (45), రికీ పాంటింగ్ (41) లు తరువాతి స్థానాల్లో ఉన్నారు.