Site icon Prime9

Shikhar Dhawan: శాంసన్ వేచి చూడాల్సిందే.. పంత్ ను వెనుకేసుకొచ్చిన థావన్

Shikhar Dhawan reveals the reason behind giving preference to Rishabh Pant over Sanju Samson

Shikhar Dhawan reveals the reason behind giving preference to Rishabh Pant over Sanju Samson

Shikhar Dhawan:  భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన పూర్తయింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన భారత్.. టీ20 సిరీస్ గెలిచి, వన్డే సిరీస్ ఓడింది. మొత్తంగా ఆరు మ్యాచ్ లకు గానూ మూడు మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయాయి. వీటిలో సంజు శాంసన్ కు కేవలం రెండో వన్డేలో మాత్రమే అవకాశం లభించింది. కాగా అదే సమయంలో అంతగా ఫాం కనపరచని రిషబ్ పంత్ కు మాత్రం అటు టీ20ల్లో, వన్డేల్లో అవకాశం లభించింది. దీనిపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన శాంసన్ కు సరైన అవకాశాలు ఇవ్వకుండా.. ఫామ్ కోల్పోయిన పంత్ ను ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

దీనిపై వన్డే టీమ్ స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ,  పంత్ టాలెంటెడ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తుది జట్టుపై నిర్ణయాలు ఉంటాయన్నాడు. పంత్ ఇంగ్లండ్ లో సెంచరీ చేశాడని, ఫామ్ లో లేనప్పుడు అతనికి అండగా నిలవాల్సి ఉంటుందని చెప్పాడు. శాంసన్ వేచి ఉండక తప్పదన్నాడు. ఒంటి చేత్తో గెలిపించే సత్తా పంత్ కు ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా తాను కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడంటూనే అతను కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ధావన్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: ప్రపంచకప్ లో మరో సంచలనం.. ఫ్రాన్స్ ఓడించిన పసికూన

 

Exit mobile version