Site icon Prime9

Robin Uthappa: క్రికెట్ కు గుడ్ బైయ్ చెప్పిన ఊతప్ప

robin uthappa said good bye to the cricket

robin uthappa said good bye to the cricket

Robin Uthappa: రాబిన్‌ ఊతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తొలి టీ20 ప్రపంచకప్‌ హీరోగా రికార్డుకెక్కిన ఊతప్ప.. టీ20 ప్రపంచకప్‌లో తొలి బౌలౌట్‌లో భారత్‌ను గెలిపించాడు. కాగా ఈ బౌలర్ బుధవారం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, తనకు సహకరించిన కర్ణాటక క్రికెట్‌ సంఘానికి, ఆదరించిన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

2006లో అంతర్జాతీయ క్రికెట్ తో అరంగేట్రం చేసిన ఊతప్ప, 46 ఓడీఐలు మరియు 13 టీ20లు ఆడాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి T20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న జట్టులో కీలక సభ్యుడిగా రాబిన్ ఉన్నాడు. అతను కర్ణాటకతో అనేక దేశీయ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు మరియు రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్లను సాధించాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మరియు 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లతో కలిసి ఆడాడు.

ప్రస్తుతం 36 ఏళ్ల ఉతప్ప తన దేశీయ కెరీర్‌ను 2002-03లో కర్ణాటక జట్టుతో ప్రారంభించి, 2020-21 సీజన్‌లో కేరళతో ముగించాడు.
అతను 142 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, దాదాపు 41 సగటుతో 22 సెంచరీలతో 9446 పరుగులు చేశాడు. మరియు 203 వన్డే గేమ్‌లలో 35.31 సగటుతో 16 సెంచరీలతో మరో 6534 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి: Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Exit mobile version