Ravichandran Ashwin: ట్విట్టర్లో ధోనికి ఇదే నా చివరి విషెస్‌.. వారికి గమనిక అంటూ అశ్విన్ ట్వీట్

Ravichandran Ashwin: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ ఒకరు. కాగా ఈ టీమిండియా ప్లేయర్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. శుక్రవారం జూలై 7న కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.

Ravichandran Ashwin: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ ఒకరు. కాగా ఈ టీమిండియా ప్లేయర్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. శుక్రవారం జూలై 7న కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ట్విటర్ వేదికగా ధోనీకి చివరిసారిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశాడు. వచ్చేసారి నేరుగా లేదా ఫోన్‌ కాల్‌ చేసైనా ధోనికి విషెస్‌ చెబుతానని గమనికగా పెట్టాడు. ఈ డిస్‌క్లెయిమర్‌ గాసిప్‌ రాయుళ్లకు, కథలు చెప్పేవారి కోసమంటూ రాసుకొచ్చారు. దీనితో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.

‘‘ గొప్ప వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పకుండా జులై 7వ తేదీని ముగిస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. హ్యాపీ బర్త్‌డే మహీ భాయ్‌. గమనిక: ట్విటర్‌ వేదికగా ఇదే నా చివరి బర్త్‌డే విషెస్‌. ఈసారి మాత్రం తప్పకుండా నేరుగా లేదా కాల్‌ చేసి శుభాకాంక్షలు చెబుతా. ఈ గమనిక మాత్రం గాసిప్‌లను వ్యాప్తి చేసేవారికి, స్టోరీలను వండి వార్చే వారి కోసం..’’ అని అశ్విన్‌ ట్వీట్ చేశాడు. కాగా అశ్విన్‌ చేసిన ఈ ట్వీట్ తో ఆయన కూడా ‘థ్రెడ్స్‌’ ఖాతాను తెరుస్తాడని, అందుకే ట్విటర్‌ను పక్కన పెడతాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక అశ్విన్ పెట్టిన ఈ పోస్ట్ కు నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లతో హల్‌చల్‌ చేశారు.

నెటిజన్ల స్పందన ఇలా(Ravichandran Ashwin)

‘అశ్విన్‌ నువ్వు ఫోన్‌ చేసినా ‘తలా’ నీ ఫోన్‌ ఎత్తడు. కాబట్టి, నువ్వు ఇక్కడే శుభాకాంక్షలు చెప్పాల్సిందే’ అని ఒకరు ‘ఇప్పుడు నువ్వుపెట్టిన ట్వీట్‌ కూడా ధోనీ చదవడులే’ అంటూ మరొకరు..’హ్యాపీ బర్త్‌డే ధోనీ.. గమనిక: అతడి నంబర్‌ నా దగ్గర లేనందున ఇక్కడే పోస్టు పెట్టా’ అంటూ ఇంకొకరు ‘మంచి నిర్ణయం. కీబోర్డు వారియర్స్‌ నుంచి తట్టుకోవడానికి ఇదే సరైన ఎత్తుగడ’ అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ తాజాగా ‘థ్రెడ్‌’ ఖాతాను తెరిచాడు. థ్రెడ్స్ ద్వారా ఎంఎస్ ధోనీకి శుభాకాంక్షలు చెప్పిన రిషభ్‌.. మెటా అధినేత జుకర్‌బెర్గ్‌కు ఓ కీలక సూచన చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ ఖాతా తెరిచేలా థ్రెడ్‌ను క్రియేట్‌ చేద్దాం. జుకెర్‌బెర్గ్‌తో సహా ఎక్కువ మందిని అందులోకి స్వాగతం పలుకుదాం. ప్రజలందరూ థ్రెడ్స్ ను ప్రయత్నించేలా.. వారికి గౌరవం దక్కేలా మరింత గొప్పగా చేయండి’’ అంటూ రిషభ్‌ పంత్ పోస్టు పెట్టాడు.