Site icon Prime9

wasim Akbar: నేను డ్రగ్స్ కు బానిసను.. వసీం అక్బర్

Wasim Akbar reveals his addicted to drugs once upon a time

Wasim Akbar reveals his addicted to drugs once upon a time

wasim Akbar: పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన జీవితంలోని సంచలన విషయాలను తెలిపాడు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని ఓ దశలో కొకైన్ కు బానిసనని వెల్లడించాడు. త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో అక్రమ్ ఈ సంగతులన్నీ పంచుకున్నాడు.

టెలివిజన్ లో క్రికెట్ వ్యాఖ్యాతగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేశానని, ఆ సమయంలోనే మాదకద్రవ్యాలకు విపరీతంగా అలవాటుపడ్డానని ఆయన వివరించాడు. దక్షిణాసియా దేశాల సంస్కృతిని పరిశీలిస్తే.. ఒక్కసారి గొప్ప పేరు వచ్చిందంటే అది మిమ్మల్ని తినేస్తుంది, మైకంలో ముంచేస్తుంది, మిమ్మల్ని అవినీతిపరులుగానూ మార్చేస్తుందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఒక్క రాత్రిలో 10 పార్టీల్లో పాల్గొనేవాళ్లు ఉంటారు అని ఆ సంస్కృతి తనపైనా తీవ్ర ప్రభావం చూపిందని వసీం వెల్లడించారు.

కానీ తన భార్య హుమా అనారోగ్యంతో బాధపడుతూ చివరిక్షణాల్లో పడిన బాధ చూశాక తాను మళ్లీ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని. అది మొదలు తాను మరెప్పుడూ పతనం కాలేదని అక్రమ్ తెలిపాడు. కామెంటరీ కోసం వెళుతున్నానని తన భార్య హుమాకు అబద్ధం చెప్పి, పార్టీల్లో పాల్గొనేవాడినని, చాలా రోజుల పాటు ఇలాగే నటించానని వివరించాడు. ఇంగ్లండ్ లో ఓ పార్టీలో పాల్గొన్న సందర్భంగానే మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నానని, అక్కడి నుంచి కొంత డ్రగ్స్ లేకుండా జీవించలేని స్థితికి వెళ్లానని.. కొకైన్ తీసుకుంటేనే తాను పనిచేయగలనని భావించేవాడ్నని అక్రమ్ తెలిపాడు.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం.. 200 కోట్ల షేర్స్ బదిలీ..!

Exit mobile version