Site icon Prime9

NZ vs PAK: సెమీస్ తొలి మ్యాచ్.. న్యూజిలాండ్​తో తలపడనున్న పాక్

PAK vs NZ t20 world cup 2022 semi final match

PAK vs NZ t20 world cup 2022 semi final match

NZ vs PAK: టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. సెమీ ఫైనల్ సమరానికి జట్లు సిద్ధమయ్యాయి. నేడు సిడ్నీ వేదికగా జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లు ముఖాముఖీ తేల్చుకోనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ సత్తాచాటుతున్న కివీస్ అంచనాలకు తగినట్టుగానే సెమీస్ రేసులోకి చేరుకుంది. గ్రూప్‌ 1 నుంచి సూపర్ 12 మ్యాచ్ లలో మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్‌ మూడింటిలో గెలిచి ఒక దాంట్లో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రైద్దెంది. ఇకపోతే ఇంటిబాట పడుతుందని భావించిన పాక్ గ్రూప్‌ 2 నుంచి అనూహ్య రీతిలో సెమీస్ దూసుకొచ్చింది.

ఇకపోతే ఈ మైదానంలోని పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఈ స్టేడియంలో ఆడిన ఈ రెండు విజయాలను నమోదు చేశాయి. మరి ఈ రోజు విజయం ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే.

న్యూజిలాండ్‌ తుది జట్టు అంచనా: విలియమ్సన్‌ (కెప్టెన్‌), అలెన్, డెవాన్‌ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాంట్నర్, టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్‌.
పాకిస్తాన్‌ తుది జట్టు అంచనా: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్, హారిస్, షాన్‌ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్‌ ఖాన్, వసీమ్, నసీమ్‌ షా, షాహిన్‌ అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌.

ఇదీ చదవండి: సానియా మీర్జా – షోయబ్ మాలిక్‌ విడిపోతున్నారా ?

Exit mobile version