New Zealand: టీ20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా పలు టీంలు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పోరులో ఐర్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్లింది. సెమీస్ రేసులో చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ టీం నిలిచింది. ఐర్లాండ్ ని 35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ ఎ నుంచి న్యూజిలాండ్ సెమీస్ లోకి అడుగుపెట్టింది.
ఆడిలైడ్ వేదికగా న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు జాషువా లిటిల్ 3, గారెత్ డెలానీ 2 వికేట్లు తీసుకున్నారు. 186 పరుగుల లక్ష్యంతో క్రీజ్ లోకి దిగిన ఐర్లాండ్ జట్టు ఓపెనర్లు న్యూజిలాండ్ కి గట్టి పోటీ ఇచ్చారు. పాల్ స్టిర్లింగ్ (27 బాల్స్ లో 37 పరుగులు) కేప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (25 బాల్స్ లో 30 పరుగులు) చక్కని ఇన్నింగ్స్ ఆడారు. కానీ, వీళ్ల తరువాత వచ్చిన బ్యాటర్లలో కాస్త తడబడ్డారు. దానితో నిర్ణీత ఓవర్లలో ఐర్లాండ్ 150 పరుగులు మాత్రమే చేసింది. 5 మ్యాచ్ ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఐర్లాండ్ ఇంటి దారి పట్టింది.
ఇదీ చదవండి: “ప్లేయర్ ఆఫ్ ది మంత్”గా విరాట్ కొహ్లీ.. ఐసీసీ అవార్డ్