SRH Vs RR : నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో తలపడనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా సేపశాల అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు నాలుగేళ్ళు తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరగనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వనుంది. ఈ సీజన్ లో వార్నర్, విలియమ్సన్, విజయ్ శంకర్ లాంటి పలువురు ప్లేయర్లు హైదరాబాద్ కి దూరం అయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ వంటి ప్లేయర్లను విడుదల చేసి, మయాంక్ అగర్వాల్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సారి మయాంక్ అగర్వాల్ హైదరాబాద్ టీమ్ కోసం ఏ స్థాయిలో రాణిస్తాడో అని అంతా అనుకుంటున్నారు.
ఇక సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే..
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠితో టాప్ ఆర్డర్ బలంగానే కనిపిస్తుంది. ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్, సఫారీ కెప్టెన్.. మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్‌లతో మిడిలార్డర్ కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. అలానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కలుపుకుంటే ఎనిమిదో నంబరు వరకు సన్‌రైజర్స్‌కు బ్యాటర్లు లైన్ అప్ లో ఉన్నారు. హైదరాబాద్ సారధి మార్‌క్రమ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. గతేడాది సన్‌రైజర్స్ తరఫున రాణించిన మార్‌క్రమ్.. నాయకత్వ లక్షణాలు, అనుభవం, బ్యాటింగ్ ఫామ్ ఈసారి జట్టుకు కలిసిరావొచ్చు.
(SRH Vs RR) సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి పరిశీలిస్తే..
భువనేశ్వర్ కుమార్ సారధ్యంలో ఉమ్రాన్ మాలిక్, యాన్సెన్, నటరాజన్‌లతో సన్‌రైజర్స్ పేస్ విభాగం పటిష్టంగా ఉంది. అలానే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్న జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ ఈసారి సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో రాణించిన అతను.. టీమ్‌ఇండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అనుభవమూ సంపాదించాడు. గత సీజన్‌లో 7 నుంచి 16 ఓవర్ల మధ్య 19 వికెట్లు తీసిన మాలిక్ మరోసారి మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపించగలడు. గుజరాత్‌కు తరలివెళ్లిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లోటు అడిల్ రషీద్ ఎలా భర్తీ చేస్తాడన్నది ఆసక్తికరం.
మరి రాజస్థాన్ విషయానికి వస్తే.. 2008 ఆరంభ ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, గత ఏడాది రన్నర్ గా నిలిచింది. ఇప్పుడు టైటిల్‌పై రాజస్థాన్ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న రాజస్థాన్ సమష్టిగా సత్తాచాటితే ప్రభావం చూపించగలదు. బ్యాటింగ్ విషయంలో జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైశ్వాల్.. బౌలింగ్‌లో చాహల్, అశ్విన్, బౌల్ట్ కీలకం కానున్నారు. చూడాలి మరి మ్యాచ్ లో ఎం జరగనుందో అని..