Women’s Asia Cup 2022: భారత పురుషుల జట్టు సాధించలేని విజయాన్ని మహిళల జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీ20 ఆసియాకప్‌ను తన సొంతం చేసుకుంది హర్మన్ సేన. సిల్హౌట్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో మహిళల భారత జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 65 పరుగులకే కుప్పకూలింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది. స్మృతి మందానా సూపర్ హిట్టింగ్‌తో ఆ లక్ష్యం మరీ చిన్నదైయ్యింది. మందానా 51 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. ఈ గెలుపుతో ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 65 పరుగులు మాత్రమే చేసింది. ఇండియన్ బౌలర్ రేణుకా సింగ్ థాకూర్ తన బౌలింగ్‌తో లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. మూడు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది రేణుకా. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణాలు చెరో రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభం నుంచే లంక బ్యాటర్లను కట్టడి చేస్తూనే వచ్చిన భారత జట్టు ఎట్టకేలకు లంకను ఇంటికి పంపి కప్పును కైవసం చేసుకుంది.
CHAMPIONS 🏆
Congratulations to India on their 7th Women’s Asia Cup triumph 👏#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/KKwY2tz2Pb | 📸 @ACCMedia1 pic.twitter.com/7U15d7ibT3
— ICC (@ICC) October 15, 2022
ఇదీ చదవండి: బీసీసీఐకు మరోసారి రూ.955 కోట్ల నష్టం..!