Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి రెండు టెస్టులో విజయం సాధించి టీంఇండియా జోరు మీదుంది. మూడో టెస్టులో కూడా పై చేయి సాధించాలిన పట్టుదలతో ఉంది. మూడో టెస్టులో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖాయం అవుతుంది. మరో వైపు వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఆసిస్ కు మూడో టెస్టు సవాల్ గా మారింది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని చూస్తోంది.
స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
అనుకున్నట్టుగానే తుది జట్టు కేఎల్ రాహుల్ స్థానం కోల్పోయాడు. రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ ని అవకాశం కల్పించింది.
మరో వైపు బౌలర్ షమీకి విశ్రాంతి ఇచ్చి ఉమేష్ యాదవ్ కు చోటు ఇచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా జట్టు లో రెండు మార్పులు చేసంది.
వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టుకు దూరమైన పాట్ కమిన్స్ ప్లేసులో మిచెల్ స్టార్క్ వచ్చాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో కామెరున్ గ్రీన్ జట్టులోకి చేరాడు.
ఆసీస్ బౌలర్ల దెబ్బకు కుదేలైన భారత్(Ind Vs Aus 3rd Test)
తొలుత బ్యాటింగ్ (Ind Vs Aus 3rd Test) చేస్తున్న భారత్ జట్టు టాప్ ఆర్డర్ ఆసీస్ బౌలర్లకు దెబ్బకు కుదేలైంది. కెఫ్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు.
తొలుత దూకుడుగా మ్యాచ్ ను ఆరంభించిన ఓపెనర్లు ఆసీస్ బౌలర్లపై అటాక్ చేశారు. వికెట్ నష్టపోకుండా 5 ఓవర్లు ఆడిన ఓపెనర్లు 25 పరుగులు చేశారు.
ఈ క్రమంలో ఆసిస్ బౌలర్ కునెమెన్ వేసిన ఓవర్ హిట్ మ్యాన్ రోహిత్ స్టంప్ అవుట్ అయ్యాడు.
దీంతో 27 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దూకుడుగా గిల్ కూడా కునెమెన్ బౌలింగ్ లో నే ఫెవిలియన్ చేరాడు.
తర్వాత వచ్చిన పుజారా ఒక్క పరుగుకే బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ జడేజా (4) కూడా కునెమన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆదుకుంటాడనుకున్న కోహ్లీ కూడా
ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా బోణీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అయితే వచ్చిన వాళ్లు వెంటనే వెనుదిరగ్గా.. కింగ్ కోహ్లీ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నట్టు కనిపించాడు.
కష్టాల్లో పడిన భారత్ ను ఆదుకుంటాడనుకున్ కోహ్లీ ( 52 బంతుల్లో 22; 2 ఫోర్లు) రన్స్ చేసి ఔటయ్యాడు. టాడ్ మార్ఫీ వేసిన 22 ఓవర్ లో నాలుగో బంతికి వికెట్ల ముందు కోహ్లీ దొరికిపోయాడు.
అయితే రివ్యూ తీసుకున్నా రిజల్ట్ భారత్ కు అనుకూలంగా రాకపోవడంతో కోహ్లీ వెనుదిరగక తప్పలేదు. మరోవైపు కీపర్ భరత్ (17) రన్స్ చేసి పెవిలియన్ బాటపట్టాడు.
దీంతో భారత్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 25 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్, అశ్విన్ కొనసాగుతున్నారు.
తొలి రెండు టెస్టులో సత్తా చాటిన భారత్.. మూడో టెస్టులో మాత్రం చేతులు ఎత్తేసింది.
ఆస్ట్రేలియా స్పిన్లర్ల చేతికి చిక్కడంతో మొదటి రోజు లంచ్ బ్రేక్ కు 7 వికెట్టు నష్టపోయి 84 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో కునెమెన్ 3 వికెట్లు, నాథన్ లైయన్ 3, మార్ఫీ 1 వికెట్ తీసుకున్నారు.
కాగా, భారత్ బ్యాటర్స్ లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా 30 పరుగుల స్కోరు చేయకపోవడం గమనార్హం.
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్, ఉమేశ్ యాదవ్, సిరాజ్
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఉస్మాన్ ఖాజా, లబుషేన్, హ్యాండ్స్‌కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ , లయన్, కున్‌మన్