Site icon Prime9

ICC ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్ మ్యాచ్ ల వివరాలు !

ICC ODI World Cup 2023 india matches schedule details

ICC ODI World Cup 2023 india matches schedule details

ICC ODI World Cup 2023 : ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్‌ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్‌ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా లేకపోవడం తెలుగు ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ.. ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు పంపి.. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాక వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

మొత్తం 10 టీమ్‌లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా ఐసీసీ మరో రెండు జట్లను నిర్ణయించనుంది. ఇక బీసీసీఐ ఖరారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. రన్నరప్‌ జట్టు న్యూజిలాండ్‌ తలపడే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ ఏడాది తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ జరగనుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. అయితే.. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌ కోసం వేదికలను ఇంకా ప్రకటించలేదు.

కాకపోతే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలేలా ఉంది. అన్ని ప్రధాన స్టేడియాల‌్లో టీమ్ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. ఉప్పల్‌లో పాకిస్థాన్ మాత్రం రెండు క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. పాకిస్థాన్‌కు ఉప్పల్‌లో ఛాన్స్ ఇచ్చి టీమ్ఇండియాకు అవ‌కాశం ఇవ్వక‌పోవ‌డం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశ కలిగిస్తుంది. చూడాలి మరి ఫైనల్ షెడ్యూల్ లో మార్పులు ఉంటాయేమో అని..

డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం వరల్డ్ కప్ లో భారత్ మ్యాచ్ లు (ICC ODI World Cup 2023)..

అక్టోబర్‌ 8 – చెన్నై – ఆస్ట్రేలియా

అక్టోబర్‌ 11 – ఢిల్లీ – అఫ్గానిస్థాన్‌

అక్టోబర్‌ 15 – అహ్మదాబాద్‌ – పాకిస్థాన్‌

అక్టోబర్‌ 19 – పుణె – బంగ్లాదేశ్‌

అక్టోబర్‌ 22 – ధర్మశాల – న్యూజిలాండ్‌

అక్టోబర్‌ 29 – లఖ్‌నవూ – ఇంగ్లాండ్‌

నవంబర్‌ 2 – ముంబై – క్వాలిఫయర్‌ జట్టుతో..

నవంబర్‌ 5 – కోల్‌కతా – దక్షిణాఫ్రికా

నవంబర్‌ 11 –  బెంగళూరు – క్వాలిఫయర్‌ జట్టుతో

 

Exit mobile version