Site icon Prime9

NZ vs SL: ఫిలిప్స్ రెండో శతకం.. లంక టార్గెట్ 168

glen Philip beaten century against sri lanka

glen Philip beaten century against sri lanka

NZ vs SL: టీ20 ప్రపంచ కప్ బరిలో పలు 12 జట్లు ముఖాముఖీ తలపడుతున్నాయి. వాటి నుంచి సెమీస్ ఎవరు వెళ్తారనేది సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు మరింత ఉత్కంఠ బరితంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే టి20 ప్రపంచకప్ 2022లో రెండో శతకం నమోదైంది. మొన్న బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా ప్లేయర్ రైలీ రోసో టీ20 ప్రపంచ కప్ 2022లో మొట్టమొదటి శతకం సాధించాడు. కాగా నేడు సిడ్నీ వేదికగా శ్రీలంక, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో తాజాగా న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ మరో సెంచరీ కొట్టాడు. పొట్టి ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా గ్రూప్ ‘1’లో శ్రీలంకతో జరుగుతోన్న పోరులో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. అందులో 10 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. డారిల్ మిచెల్ తో కలిసి ఫిలిప్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శ్రీలంక బౌలర్ కసున్ రజిత 2 వికెట్లు తీశాడు. మరి ఈ పోరులో ఎవరు నెగ్గుతారు అనేది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: భారత పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం.. బీసీసీఐ

Exit mobile version