Ajinkya Rahane: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ఇండియా టెస్టు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నయా వాల్ పుజారా, ఉమేష్ యాదవ్ లపై వేటు వేసిన సెలక్టర్లు షమీకి విశ్రాంతి ఇచ్చారు. కాగా ఇటీవల కంబ్యాక్ ఇచ్చి సత్తాచాటుతున్న అంజిక్యా రహానే సెలక్టర్లు ఓకే చేశారు. 18 నెలల తరువాత జట్టులో చోటు దక్కింకుని డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణించిన అజింక్య రహానెను తిరిగి వైస్ కెప్టెన్‌గా వెస్టిండీస్ సిరీస్ కు టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమించారు. జూలై 12 నుంచి టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగనున్నాయి.
సెలక్టర్లపై మండిపడిన గంగూలీ(Ajinkya Rahane)
ఇదిలా ఉంటే.. వెస్ కెప్టెన్‌గా అజింక్య రహానెను నియమించడాన్ని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత పునరాగం చేసి ఒక్క మ్యాచుల్లో సత్తా చాటగానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్లకు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అసలు సెలక్టర్లు ఆలోచన విధానం ఏంటనేది తనకు అర్ధం కావడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లలో గత కొంతకాలంగా రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతున్నాడని, అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేదని గంగూలీ అన్నాడు. అదే సమయంలో టెస్టుల్లో పుజరా స్థానం ఏంటి అనే విషయంలో సెలక్టర్లు ఓ స్పష్టతతో ఉండాల్సి ఉందని, ఆ విషయాన్ని అతడికి ఖచ్చితంగా చెప్పాలన్నారు. వందకు పైగా టెస్టులు ఆడిన పుజారాను వెస్టిండీస్ పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదు అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.