David Warner: ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. అదే తన ఆఖరి మ్యాచ్ అంట

డబ్లూటీసీ కప్ ముంగిట ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్న‌ర్ టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తో జరిగే టెస్టు సిరీస్ అనంతం ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.

David Warner: డబ్లూటీసీ కప్ ముంగిట ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్న‌ర్ టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తో జరిగే టెస్టు సిరీస్ అనంతం ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. తన ఫేవరెట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోనే ఆయన తన ఆఖరి మ్యాచ్ ఆడనున్నట్టు తెలిపారు. శనివారం బెకెన్ హామ్లో ప్రాక్టీస్ ముందు ఆయన మీడియా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

శనివారం బెకెన్‌హామ్‌లో ప్రాక్టీస్‌కు ముందు వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌న‌కు ఆఖ‌రి మ్యాచ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే అంత‌కు ముందే ఆయన టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోనున్నట్టు వెల్లడించారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా వేదికగా భార‌త్‌తో జ‌రిగే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం డేవిడ్ వార్న‌ర్ ప్రాక్టీస్ అవుతున్నారు. ఈ మ్యాచ్ అయిన వెంటనే ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడ‌నుంది.

లాస్ట్  మ్యాచ్ పాకిస్థాన్ తో(David Warner)

‘ప్ర‌పంచ‌క‌ప్‌లో తన మంచిగా రాణించి ప‌రుగులు సాధిస్తే ఆసీస్‌కు ఆడ‌తాన‌ని తన కుటుంబానికి మాట ఇచ్చినట్టు వార్నర్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌తో సిరీస్ త‌రువాత‌ వెస్టిండీస్ సిరీస్ కు మాత్రం తాను ఆడ‌డం లేదని వివరించారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌, యాషెస్ సిరీస్‌ల్లో బాగా రాణిస్తే ఖ‌చ్చితంగా పాకిస్థాన్ సిరీస్‌కు ఎంపిక అవుతానని.. దానితో అదే నా ఆఖ‌రి టెస్టు మ్యాచ్ అవుతుంద‌ని’ వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్ రిటైర్‌మెంట్ అనంత‌రం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌నున్న‌ట్లు ఆయన చెప్పాడు.

గ‌త కొంత కాలంగా వార్న‌ర్ అంతగా ఫామ్ లో కనిపించడం లేదు. గ‌త రెండు ఏళ్లలో 17 టెస్టులు ఆడిన వార్న‌ర్ కేవ‌లం ఒకే ఒక సెంచరీ చేశారు. వార్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆసీస్ త‌రుపున 103 టెస్టుల్లో 45.6 స‌గ‌టుతో 8,158 ప‌రుగులు చేశాడు.