India Grand Victory: శ్రీలంకతో (IND vs SL) జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లంక జట్టుపై భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
భారీ విజయం
శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్ లో భారత్ అజేయంగా 317 పరుగులతో లంకను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలతో 390 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో విఫలమైన లంక కేవలం.. 73 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ శతకాలతో రాణించారు.
కోహ్లి 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 166 రన్స్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ 97 బాల్స్‌లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 116 రన్స్ చేశాడు.
కోహ్లి, గిల్ మెరుపులతో భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 390 రన్స్ చేసింది.
చేతులెత్తేసిన లంక బ్యాట్స్ మెన్
రికార్డ్ టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు.
వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 22 ఓవర్లలో 73 పరుగులకు లంక ఆలౌట్ అయ్యింది.
శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
19 రన్స్‌తో ఫెర్నాండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
షమీ, కుల్దీప్ యాదవ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
లంక చరిత్రలో పెద్ద ఓటమి
లంక Srilanka Worst Record బౌలర్లలో కుసుమ్ రజిత మూడు వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేసిన లంక బ్యాటర్లు.
ప్రారంభం నుంచే తడబడిన లంక బ్యాటర్లు.
ఏ దశలోనూ కోలుకోలేకపోయిన లంక బ్యాటింగ్ లైనప్.
భారత బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన శ్రీలంక.
లంక చరిత్రలో ఇదో అతిపెద్ద పరాజయం.
శ్రీలంకను వెంటాడుతున్న ఓటములు.
ఆసియా కప్ తర్వాత పెద్దగా రాణించని శ్రీలంక.
ఈ ఓటమితో నిరాశలోకి లంక ఆటగాళ్లు.
భారత బౌలర్లను ఎదుర్కొలేక నానా తంటాలు.
ఈ సిరీస్ లో అత్యుత్తమ స్పీడ్ బాల్ వేసిన ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/