Site icon Prime9

Asia cup 2022 Final: లంకతో పాకిస్థాన్ తుది పోరు… ఆసియా కప్ ఎవరి సొంతం..?

Asia cup 2022 final match

Asia cup 2022 final match

Asia cup 2022 Final: ఆసియా ప్రపంచకప్-2022 ఫైనల్ పోరు నేడు రసవత్తరంగా సాగనుంది. ఆసియా కప్ కోసం శ్రీలంతో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య నేడు ఆసియాకప్‌ ఫైనల్‌ జరుగనుంది. పేరెన్నికగన్న ప్లేయర్లతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. సూపర్‌-4 దశలోనే ఇంటిదారి పట్టగా.. లంక, పాక్‌ టైటిల్‌ కోసం ఫైనల్ బరిలో నిలబడ్డాయి.

ప్రణాళిక ప్రకారం ఈ మెగా మ్యాచ్ లంకలోనే జరుగాల్సి ఉండగా అక్కడ ఆర్థిక సంక్షోభం కారణంగా యూఏఈకి మార్చిన విషయం విధితమే. భారత్‌, పాక్‌ మధ్య ఫైనల్‌ జరుగుతుందని క్రికెట్ ప్రియులు ఊహించినా.. అద్భుతమైన ఆటతీరు కనబర్చిన లంక ఫైనల్‌కు దూసుకొచ్చింది. సూపర్‌-4 దశలో పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య జరిగిన పోరులో లంకను విజయం వరించగా… ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పాకిస్థాన్‌ ఎదురుస్తోంది. మరి ఆసియా కప్ ను ఎవరు కైవసం చేసుకుంటారో తెలియాలంటే ఈ రోజు జరుగునున్న ఫైనల్ పోరు చూడాల్సిందే.

ఇదీ చూడండి: Aaron Finch: వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆరోన్ ఫించ్

Exit mobile version