Site icon Prime9

Asia Cup 2022: అఫ్గానిస్థాన్ బౌలర్ల దెబ్బ బంగ్లాదేశ్ అబ్బా

Afghanistan huge win on Bangladesh

Asia Cup 2022: ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ బౌలర్లు దెబ్బకు బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులను మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మస్కద్ హుస్సేన్ 31 బాల్స్ కు 48 పరుగులు, మహముదుల్లాహ్ 27 బాల్స్ కు 25 పరుగులు, హాసన్ 12 బాల్స్ కు 14 పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్ల ముజీబ్ ఉర్ రెహ్మాన్ రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే జాద్రన్ 17 బాల్స్ కు 43 పరుగులు, ఇబ్రహీం జాద్రన్ 41 బాల్స్ కు 42 పరుగులు, జాజాయ్ 26 బాల్స్ కు 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ హుస్సేన్, హాసన్, మహమ్మద్ సైఫుద్దీన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ టీమ్ b పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

Exit mobile version