Sanjita Chanu: స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణ పతక విజేత సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడింది. ఆమె డ్రొస్టనొలోన్ అనే ఉత్ర్పేరకం వాడినట్టు పరీక్షల్లో తేలింది. దాంతో జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ (నాడా) ఆమెపై ప్రాథమిక నిషేధం విధించింది.
గత సెప్టెంబర్–అక్టోబర్ లో గుజరాత్ లో జరిగిన నేషనల్ గేమ్స్ సందర్భంగా సంజిత చాను నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా అందులో ఉత్ప్రేరక మందుల్ని తీసుకున్నట్టు గుర్తించారు. ఈ గేమ్స్ లో 49 కేజీల విభాగంలో సంజిత రజితం కైవసం చేసుకుంది. శాంపిల్ తీసుకున్న తేదీ నుంచి ఆమెపై ప్రాథమిక నిషేధం అమల్లో ఉంటుందని నాడా తెలిపింది.
నాలుగేళ్ల నిషేధం
సంజిత కేసును నాడా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ విచారణ చేపట్టింది. ఒకవేళ సంజిత (Sanjita Chanu) ఉద్దేశపూర్వకంగా డోపింగ్ కు పాల్పడినట్టు తేలితే ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. కాగా, గతేడాది బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజిత స్వర్ణం గెలిచింది.
గతంలోనూ సస్పెన్షన్ వేటు
ఆమె గతంలో కూడా డోపింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంది. 2018 మేలో ఆమె శాంపిల్స్ లో టెస్టోస్టిరాన్ ను గుర్తించడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది. కానీ, అధికారుల తప్పిదం కారణంగా సంజిత (Sanjita Chanu) శాంపిల్ మిక్సింగ్ అయినట్టు గుర్తించడంతో 2020లో ఆమెపై వేటను తొలగించారు. మరి నాడా ఈ వెయిట్ లిఫ్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకోనుంది.. ఆమె, తర్వాత జరుగబోయే టోర్నీల్లో పాల్గొటారా లేదా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
Sania Mirza: టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్.. అదే చివరి టోర్నీ అంటూ క్లారిటీ
INDIA vs SRILANKA : టీమ్ ఇండియా కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్… 5 నో బాల్స్, 37 రన్స్ ?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news