Chennai Super Kings Vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ 25వ మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో ఇరు జట్లు వెనుకపడ్డాయి. చెన్నై జట్టు 9వ స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా 6వ స్థానంలో ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి చెందితే వరుసగా 3 సార్లు పరాజయం చవిచూసిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లో దూరమయ్యాడు. దీంతో ధోనీ మళ్లీ చెన్నై సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.