Australia: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్ పై సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాపై తక్కువ ఓవర్లలో టార్గెట్ ను ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.
ఆసీస్ సరికొత్త రికార్డ్.. (Australia)
ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేలో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో తొలి వన్డే ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది.
రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదిచింది.
ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(66), హెడ్(51) పరుగులతో మ్యాచ్‌ను ముగించేశారు. దీంతో ఇండియాపై 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన జట్టుగా ఆస్ట్రేలియా ఘనత సాధించింది. దీంతో వన్డేల్లో ఓవర్ల పరంగా అత్యధిక వేగంగా టార్గెట్ ఛేదించిన జట్టుగా ఆసీస్ నిలిచింది. అంతకుముందు 2019లో హామిల్టన్ వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో భారత్‌పై 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో ఛేదించింది.
దీంతో కివీస్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. ఇక ఓవరాల్‌గా ఓవర్ల పరంగా ఆస్ట్రేలియాకు ఇది మూడో అతి పెద్ద విజయం.
చుక్కలు చూపించిన స్టార్క్
రెండో వన్డేలో మిచెల్ స్టార్క్ టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ పేసర్.. రెండో వన్డేలో చెలరేగిపోయాడు.
ఏకంగా 5 వికెట్లు తీసి.. భారత పతనాన్ని శాసించాడు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2023 కు ఆసీస్ కు మరింత బలం పెరగనుంది. ఐదు వికెట్లు తీసి ఓ మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు.
ఇక వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లసిత్ మలింగ (8)ను వెనక్కునెట్టి, బ్రెట్ లీ (9), షాహిద్ అఫ్రిది (9) సరసన చేరాడు.
అద్భుతమైన డైవ్ క్యాచ్ అందుకున్న స్మిత్
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్‌ను అందుకున్నాడు.
పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు.
భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్‌లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు.
వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే.
Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav
India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR— Rajkumar (@Rajkumar0507) March 19, 2023