Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు.. అవమానం తట్టుకోలేకే తప్పుకున్నాడు!

Ashwin’s father makes big statement on international cricket: న్యూఢిల్లీ, కిరణం: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే తన కుమారుడు రిటైర్మెంట్ ప్రకటించాడని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం అశ్విన్ బయలుదేరి, గురువారం చెన్నై చేరుకున్నారు.

కాగా, అతడిని ఘనంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అశ్విన్ ప్రకటించే వరకు రిటైర్మెంట్ గురించి నాకు కూడా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, తన తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలీదని, అందుకు తాను సారీ చెబుతున్నానని అశ్విన్ అనంతరం మాట్లాడారు.