Site icon Prime9

ICC Rankings: ఆండర్సన్‌ ప్రపంచ రికార్డు.. చేరువలో రవిచంద్రన్ అశ్విన్

ashwin

ashwin

ICC Rankings: ఐసీసీ తాజాగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో టాప్ 5 లో ఇద్దరు భారత బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లు తీసిన అండర్సన్.. మెుదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

కమిన్స్ రికార్డ్ బ్రేక్.. (ICC Rankings)

ఇంగ్లాండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో మెుదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేయడం ఆండర్సన్‌ కు ఇది ఆరవసారి. ఆస్ట్రేలియా కెప్టెన్‌.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ప్యాట్‌ కమిన్స్‌ ఇప్పటి వరకు టెస్టు ర్యాంకింగ్స్ లో మెుదటి స్థానంలో ఉండేవాడు. ప్రస్తుతం కమిన్స్ ని వెనక్కి నెట్టి అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

87 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అండర్సన్

తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు. సుమారు 87 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అత్యధిక వయసులో టెస్టు నంబర్‌ 1 బౌలర్‌ గా అవతరించాడు. 40 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఫీట్‌ ను సాధించాడు. ఈ రికార్డు గతంలో ఆస్ట్రేలియా దిగ్గజం క్లారీ గ్రిమెట్‌ పేరిట ఉంది. 44 ఏళ్ల 2 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ప్రతి జట్టులో యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో.. 40 ఏళ్ల దాకా జట్టులో కొనసాగడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో అండర్సన్ రికార్డును బద్దలు కొట్టేవారు లేరు.

మొదటి ర్యాంకుకు చేరువలో అశ్విన్‌

తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అండర్స్ న్ 866 పాయింట్లతో ఒకటో స్థానంలో ఉండగా.. 864 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఆసీస్ తో మరో రెండు టెస్టు మ్యాచులు ఉన్నాయి. దీంతో అశ్విన్ మెుదటి ర్యాంకుకు చేరుకుంటాడని భావిస్తున్నారు. అలాగే.. న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ కు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కావునా.. అశ్విన్ రెండు టెస్టు మ్యాచుల్లో తీసిన వికెట్లను బట్టి నెంబర్ వన్ స్థానం మారనుంది. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో.. అశ్విన్ ఈ రికార్డును బద్దలు కొడుతాడని అందరు భావిస్తున్నారు. అదే జరిగితే.. ఆశ్విన్ ప్రపంచ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో అశ్విన్‌ 14 వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌తో ఇంకా రెండు టెస్టులు ఉన్నాయి. అందులోను భారత్ లో ఈ సిరీస్ జరుగుతుంది. స్పిన్ పిచ్ లపై అశ్విన్ చెలరేగిపోతాడు కావున.. అశ్విన్ ప్రంపచ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. దీంతో కమిన్స్ తో అశ్విన్ కు పోటీ దూరమైంది. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో జేమ్స్‌ ఆండర్సన్‌ 866 పాయింట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 864 పాయింట్లు.. కమిన్స్‌ 858 పాయింట్లతో.. ఓలీ రాబిన్సన్‌ 820 పాయింట్లతో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో
టిమిండియా పేసర్.. 795 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

 

Exit mobile version