Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు అస్ట్రేలియా ఓపెనర్.. ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలికాడు. ఇది వరకే వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ఓపెనర్.. తాజాగా టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన సారథిగా ఫించ్ ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్.. టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఫించ్ ప్రకటించారు. ఈ ఓపెనర్.. గతేడాది సెప్టెంబర్‌లోనే వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ పలికాడు.
ఆ తర్వాత టీ20 లకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా.. అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు.
స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ విఫలమైంది. టైటిల్ గెలుచుకోవడంలో విఫలం కావడంతో.. ఫించ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ప్రస్తుతం ఫామ్ పరంగా కూడా.. రాణించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 వరకు తాను ఆడటం కష్టమేఅని.. అందుకే ఆసీస్ జట్టు సారథిగా దిగిపోతున్నా.
దీనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నాను. ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. అంటూ ప్రకటన చేశాడు.
వచ్చే ఏడాది మెగా టోర్నీ నాటికి జట్టును సమాయత్తం చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుంది.
అంతర్జాతీయ కెరీర్‌లో విజయవంతం కావడానికి నాకు సహకరించిన వారికి. అలాగే తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
తొలిసారి టీ20 ప్రపంచకప్ 2021, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేనివి.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 12 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది.
దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తున్నా అని ఫించ్ వెల్లడించాడు.
వన్డే ప్రపంచకప్‌లను నెగ్గి దిగ్గజ జట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. ఆస్ట్రేలియా పొట్టి కప్‌ను సొంతం చేసుకోవాలనే చాలా కలలు కన్నది.
ఆ కలను ఆరోన్ ఫించ్ నెరవేర్చాడు. ఫించ్ నాయకత్వంలోనే యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ను ఆసీస్ గెలుచుకుంది.
ఆసీస్ తరపున 146 వన్డేలు ఆడిన ఫించ్.. 5,406 పరుగులు సాధించాడు. ఇందులో 17 శతకాలు ఉండగా.. 30 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఇక 103 టీ20లు ఆడిన ఫించ్.. రెండు సెంచరీలు, 19 అర్ధ శతకాలతో 3,120 పరుగులు సాధించాడు.
కేవలం ఆసీస్ తరపున.. ఐదు టెస్టులను మాత్రమే ఆడిన ఫించ్ 278 పరుగులు సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. దేశవాలీ, క్లబ్, లీగ్‌లకు ఫించ్ అందుబాటులో ఉంటాడు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/