Japan : భారత్ లాంటి దేశాలు అత్యధిక జనాభాతో సతమతమవుతుంటే జపాన్ లాంటి దేశాల్లో జననాల రేటు బాగా తగ్గిపోతోందని వాపోతోంది. ప్రస్తుతం శిశుజననాల రేటు వందేళ్ల కనిష్ఠానికి దిగివచ్చింది. దీంతో ప్రభుత్వం తమ పౌరులను పెద్ద ఎత్తున పిల్లలను కనండి బాబు అంటూ బుజ్జిగిస్తోంది. కావాలంటే మీకు డబ్బు కూడా ఇస్తామంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జపాన్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దేశంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో దానికి తగ్గట్టు కొత్తగా జననాల రేటు భారీగా తగ్గిపోవడంలో బ్యాలెన్స్ కుదరడం లేదు. దేశంలో పనిచేసే యువత లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. దీంతో జనాభా పెంచుకోవడానికి జపాన్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అంశాలను పరిశీలిస్తోంది. ప్రజలకు ప్రోత్సాహాకాలు ఇస్తే జనాభా పెరిగే అవకాశం ఉందని జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వశాఖ భావిస్తోందని తాజాగా మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
జపాన్‌లో పెళ్లి చేసుకొని పిల్లలు కంటే చైల్డ్‌కేర్ లంప్సమ్ గ్రాంట్ కింద 2,52,338 రూపాయల ఆఫర్ చేస్తోంది. అయినా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జపాన్ ప్రభుత్వం ఏకంగా 5 లక్షల యెన్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 3,00,402 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జపాన్‌కు చెందిన హెల్త్ మినిస్టర్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడాతో గత వారం చర్చలు జరిపారు. జనాభా పెంచడానికి ప్రోత్సహకాలను కాస్తా పెంచుదామని ప్రధానమంత్రి దృష్టి తీసుకువచ్చారు. కాగా ప్రధానమంత్రి కూడా దీనికి అనుకూలంగా స్పందించారని చెబుతున్నారు. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త జంటలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రోత్సహకాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున పిల్లలు కనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గతంతో పోల్చుకుంటే భారతీయ కరెన్సీ ప్రకారం కేవలం 48వేల రూపాయాలు మాత్రమే ప్రభుత్వం పెంచింది. జపాన్‌లో ఒక్కో కాన్పుకు సొంతంగా డబ్బు చెల్లించుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రకటించిన చైల్డ్ బర్త్ అండ్ చైల్డ్‌కేర్ లంప్స్మ్ గ్రాంట్ విషయానికి వస్తే జపాన్ పబ్లిక్ మెడికల్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్ భరిస్తుంది. సాధారణంగా జపాన్‌లో ఒక డెలివరీ లేదా కాన్పుకు 4లక్షల73వేల యన్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం తాజాగా ఆఫర్ చేస్తున్న ప్రోత్సాహకాల తర్వాత కాన్పు అయిన తర్వాత ఆస్పత్రి బిల్లు చెల్లించిన తర్వాత జంటకు మిగిలేది కేవలం 30వేల యూవాన్లు మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వ గ్రాంట్ పెంచిన తర్వాత కూడా పేరంట్స్ చేతికి పెద్దగా డబ్బు రాదు.
మొట్టమొదటిసారి జపాన్‌లో చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ కింద 2009లో ప్రభుత్వం 80వేల యెన్లు పెంచింది. కాగా జపాన్ ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన జనాభా గణాంకాల వివరాల ప్రకారం వందేళ్లలో ఈ స్థాయిలో జననాల రేటు పడిపోవడం ఇదే మొదటిసారని పేర్కొంది. గత ఏడాది దేశంలో 8,11,604 మంది శిశువులు పుడితే.. అదే సమయంలో 14,39,809 మంది చనిపోయారు.ఈ లెక్కన చూస్తే జనాభా 6,28,205 తగ్గినట్లు లెక్క. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే మొదటిసారి అని ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.
జపాన్‌తో పాటు దక్షిణ కొరియాలో కూడా యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి పెద్ద ఇష్టపడ్డం లేదు. సింగిల్ గానే జీవితం గడపాలనే ఆలోచనకు వచ్చారు. పెళ్లి చేసుకొంటే అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది.. పిల్లల సంరక్షణ అత్యంత ఖరీదైన విషయం కాబట్టి.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే కాలం గడపాలనుకుంటున్నారు. అదనపు బాధ్యతలను తాము మోయలేమని స్థాయికి యువత వచ్చారు. యువతలో వస్తున్న మార్పుల కారణంగా దాని ప్రభావం దేశ జనాభాపై పడుతోంది. ప్రస్తుతం జపాన్ కూడా జనాభా కొరతతో సతమతమవుతోంది.