Site icon Prime9

KTR Vs Bandi: బండి సంజయ్ అరెస్టుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR Vs Bandi

KTR Vs Bandi

KTR Vs Bandi: తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లో ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి అరెస్టు సమయంలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సంజయ్ ను కరీంనగర్ లో అరెస్ట్ చేసి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు బీజేపీ కార్యకర్తలున పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో బండి సంజయ్ ను రామారాం నుంచి మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

బండి అరెస్టు ఎందుకు?

మరో వైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రామారం పోలీస్ స్టేషన్ కు వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. సంజయ్ ను పరామర్శించేందుకు వస్తే తనను అడ్డుకోవడంమై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అనంతరం రఘనందన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ ను అసలెందుకు అరెస్టు చేశారో పోలీసులు చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు.

 

పిచ్చోని చేతిలో పార్టీ(KTR Vs Bandi)

అయితే బండి సంజయ్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే బండి సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు..’ అని పోస్ట్ చేశారు.

 

Exit mobile version