Khammam Politics: ఖమ్మంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కు చెందినవారే కావడం విశేషం. జిల్లాలో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఈ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఉమ్మడి జిల్లా మెుత్తం దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది.
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. నేతలు తమకే టికెట్ వస్తుందటూ ఎవరికే వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళా టికెట్ ఆశించి రాకపోతే.. ఏం చేయాలో కూడా ముందే నిర్ణయించుకుంటున్నారు. కేసీఆర్ మాత్రం సిట్టింగ్ నేతలకే టికెట్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. దీంతో మాజీ మంత్రి పాలేరు తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావుకు ఈ సారి సీటు రాదనే విషయం తెలిసిపోయింది. కేసీఆర్ మెప్పు పొందేందుకు తుమ్మల ఆత్మీయ సమ్మేళనాలతో తన బలాన్ని చూపేందుకు ప్రయత్నించారు. బలం చూసైనే కేసీఆర్ ఈసారి టికెట్ ఇస్తారేమో అని ఆశిస్తున్నారు.
అధిష్టానం చూపు ఎటు?
ఈ సారి తమకే టికెట్ వస్తుందని… తుమ్మల, ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేదంర్ రెడ్డి ఆశీస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉంటామని ఇద్దరు నేతలు అంటున్నారు. అయితే ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఎంతమంది పోటీలో ఉన్నా.. పార్టీ నుంచి ఒక్కరే ఉంటారు కాబట్టి.. కేసీఆర్ సమాధానం కోసం ఇద్దరు నేతలు ఎదురు చూస్తున్నారు.
పాలేరులో మంత్రి వేముల పర్యటించిన సందర్భంగా ఓ ప్రకటన చేశారు.
ఇప్పుడు ఆ ప్రకటన నియోజకవర్గంలో వైరల్ గా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరని పరోక్షంగా మంత్రి వేముల అన్నారు.
టికెట్ ఎవరికి వస్తుందో ఆ ప్రకటనతో చెప్పేశారు. కే
సీఆర్ ఆదేశాలు లేకుండా కేసీఆర్ నుంచి ఆదేశాలు లేకుండా వేముల ఇలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని చర్చించుకుంటున్నారు.
దీంతో పాలేరు నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
కందాలకు ప్రాధాన్యత ఎందుకో తెలుసా?
కందాల ఉపేందర్ రెడ్డిపై కేసీఆర్ కు నమ్మకం ఉందని మంత్రి వేముల అన్నారు.
ఉపేందర్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరని అనడంపై.. తుమ్మల వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయాలి గాని.. మంత్రి వేముల ఇలా చేయడం సరికాదని అంటున్నారు..
ప్రస్తుతం పార్టీలో తుమ్మల పరిస్థితి దారుణంగా ఉంది.
పొమ్మనకుండా పొగ పెడుతున్నట్లు ఉందని పలువురు నేతలు అంటున్నారు.
తుమ్మల నాగేశ్వర రావు వేరే దారి చూసుకుకోవడం మంచిదని ఆయన ఆత్మీయులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలపై అధిష్టానం సీరియస్ గా ఉంది.
ఈ సమ్మేళలనాలతో వారికి వ్యక్తిగతంగా లాభం తప్పా.. బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం లేదని కీలక నేతలు అంటున్నారు.
పొంగులేటి, తుమ్మల ఆత్మీయ సమావేశాలపై బీఆర్ఎస్ నిఘా ఉంచినట్లు సమావేశం.
ఈ పరిస్థితులను చూస్తే.. వచ్చే ఎన్నికల్లో పాలేరు హట్ సీట్ గా మారే అవకాశం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/