Site icon Prime9

Ravindra Jadeja: గుజరాత్ ఎన్నికలు.. రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టిక్కెట్

Ravindra Jadeja

Ravindra Jadeja

Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టిక్కెట్  లభించింది. ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. 100 మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని యాదవ్ తెలిపారు.

తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పార్టీ సీనియర్ నేత భూపేంద్రసింగ్ చుడాసమా ప్రకటించారు.సెప్టెంబర్ 5, 1990లో జన్మించిన రివాబా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆమె 2019లో బీజేపీలో చేరారు. రివాబా మరియు రవీంద్ర జడేజా ఏప్రిల్ 17, 2016న పెళ్లి చేసుకున్నారు. గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

Exit mobile version