Site icon Prime9

Addanki Dayakar: కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దు.. అద్దంకి దయాకర్

Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తప్పు బట్టారు. సీనియర్ నాయకుడిగా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని విమర్శించారు. పీసీసీ, ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతున్నట్లు ఉందన్నారు. అంతర్గత అంశాలపై సలహాలు ఇవ్వాల్సిందిపోయి. పీసీసీపై వ్యాఖ్యలు చేస్తే పార్టీకే నష్టమని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మారారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమని అన్నారు.

Exit mobile version
Skip to toolbar