Site icon Prime9

Komatireddy: మునుగోడులో ఉద్రిక్తత పరిస్థితులు.. కోమటిరెడ్డిపై చెప్పుతో దాడి..!

congress leaders attack on komatireddy Rajagopal reddy

congress leaders attack on komatireddy Rajagopal reddy

Komatireddy: తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజరవర్గంలో జరిగే ఉప ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారపర్వం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య చిన్నపాటి ప్రపంచ యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులైతే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని ఇటీవల బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి.

దానితో బీజేపీ శ్రేణులు ఈ పనికి పాల్పడ్డారని ఆరోపిస్తూ స్రవంతి జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ శ్రేణులు అదే సమయానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించారు. కోమటిరెడ్డి ప్రచారం చేస్తున్న వాహనంపైకి ఎక్కి చెప్పుతో కొట్టేందుకు ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నించాడు. దానిని గమనించిన కోమటిరెడ్డి వెనక్కి జరిగారు. వెంటనే బీజేపీ కార్యకర్తలు సదరు కాంగ్రెస్ కార్యకర్తను పక్కకు లాగేశారు. దీనితో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం..ఆర్వో రోహిత్ సింగ్

 

Exit mobile version