Site icon Prime9

Cm Ys Jagan : నాకు టీవీలు, పేపర్లు లేవు… వారినే నమ్ముకున్నానన్న సీఎం జగన్… మరి సాక్షి ఎవరిది అంటూ ?

cm jagan comments about not having tv channel and paper goes viral

cm jagan comments about not having tv channel and paper goes viral

Cm Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీ స్సులు మాత్రమే ఉన్నాయసీఎం జగన్ వ్యాఖ్యానించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక మైనార్టీని, పేద వర్గాలను మాత్రమే నమ్ముకున్నాను అని తెలిపారు. మంగళవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇది కులాల మధ్య యుద్ధం కాదని, పేదవారికీ పెత్తందార్లకు మధ్య జరిగే జరిగే యుద్ధమని… పొరపాటున వైసీపీ ఓడిపోతే పేదవాడు నాశనమైపోతాడని సీఎం జగన్ అన్నారు.

చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని… కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజమండ్రి పుష్కరాల్లో ఫొటో షూట్ కోసం డ్రోన్ షాట్ల కోసం డైరెక్టరును దగ్గర పెట్టుకుని చంద్రబాబు గేట్లున్నీ మూసివే యడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని ఎద్దేవా చేశారు. కందుకూరులో మీటింగ్ కి జనం తక్కువ రాగా ఎక్కువగా వచ్చినట్టు చూపించడానికి సందులోకి జనాన్ని తీసుకెళ్లి వారిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని విమర్శించారు. అదే విధంగా చంద్రబాబు సభకు జనం రావడం లేదనే కారణంతో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి… వేలల్లో టోకెన్లు ఇచ్చి అర కొరా పంపిణీ చేసి గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నారు.

గుంటూరు ఘటనలో పోలీసులను తప్పుబట్టడాన్ని జగన్ తప్పుబట్టారు. చంద్రబాబు హయాంలో మంచి స్కీమ్లు ఏమీ లేవని, ఉన్న ఏకైక స్కీం దోచుకో, పంచుకో, తినుకో… అనేది అని వ్యాఖ్యానించారు. ‘కోర్టులో జడ్జి ముందుకు ఒకాయన వచ్చారు. ‘నేను తల్లిదండ్రులు లేని వాడిని. నన్ను శిక్షించకండి’ అని ఏడుపు ముఖంతో చూశాడు. ఆ జడ్జి చలించి పోయి ‘ఇంతకీ ఇతను చేసిన నేరం ఏమిట’ని అడిగారు. ‘అతనికి తల్లిదం డ్రులు లేని మాట నిజమే. కానీ వారిని ఇతనే చంపేశాడు’ అని ప్రాసిక్యూటర్ సమాధానం చెప్పారు. చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని ఎద్దేవా చేశారు. పెన్షన్ సొమ్ము పెంచుకుంటూ పోతానని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ రూ.250 పెంచి అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం జగన్ టీవీ, పేపర్ లేవని చెప్పడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూ సాక్షి ఎవరిది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version