Sujana Chowdary: 2014లో 175 మంది ఎమ్మెల్యేలు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు నాటి తీర్మాణానికి మద్దతు ఇచ్చారన్నారు. అన్నీ పార్టీల రాజధానిగా అంగీకరించాయని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉందన్న సుజనా చౌదరి గత పాలకుల ప్రభుత్వంలోని అంశాలు కూడా ఎంతో ప్రధానమని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపధ్యంలో దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైన పార్టీలు మారిన్నప్పుడల్లా ఇలాంటి సంక్షోభాలు వస్తే ఎలా అన్న మీమాంసలో సర్వోత్తమ న్యాయస్ధానం వద్దకు ఏపి రాజధాని బంతి చేరడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తుంది.