Sreeleela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ “శ్రీలీల”. ఇప్పుడు ఈ అమ్మడు కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకాలో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని బడా హీరోల సరసన దాదాపు 10 సినిమాల్లో ఈ అందాల తార నటిస్తోన్నట్టు టాక్. మొత్తానికి వరుస సినిమాల్లో నటిస్తూ ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.