Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఈమె తన అందం అభినయంతోనే కాకుండా మల్టీటాలెంట్ స్కిల్స్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. గోల్ఫ్, కరాటే, భరతనాట్యం, షటిల్ ఇలా పలు రంగాల్లో ఈమెది అందెవేసిన చెయ్యి. మోడలింగ్లోనూ తన సత్తా చాటింది. ప్రేక్షకులు కోరిన మిస్ ఇండియాగానూ మెరిసింది.