Tejaswi Madivada : “తేజస్వీ మాదివాడ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది. ఇక తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో హీరోయిన్ చెల్లి క్యారెక్టర్ లో జీవించేసింది. కేరింత మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాని తర్వాత పలు మూవీస్‌లో నటించిన ఈ భామ.. తర్వాత మూవీస్ కి కొంచం గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ తో ఇటీవల ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యూత్ ను తనవైపు తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.