Sruthi Haasan : శృతి హాసన్.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇటీవల క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన ఈ అమ్మడు.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో డబుల్ హిట్స్ అందుకుంది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలోనూ నటిస్తోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని 30 వ మూవీ లోనూ శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇక పోతే లేటెస్ట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ భామ.. బ్లాక్ డ్రస్ లో జిగేల్ అనిపంచేలా.. తన అందంతో అందరి మతి పోగొడుతుంది.