Shivangi Verma: తమిళ హీరో విజయ్ ఆంటోనీ తాజా చిత్రం ‘బిచ్చగాడు 2’ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్లతో పాటు మరో బ్యూటీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆమె ‘శివంగి వర్మ’. బిచ్చగాడు 2 లో డుముకు చల్ అంటూ వచ్చే పాటలో తన డ్యాన్స్ , అందంతో అట్రిక్టివ్ గా కనిపించింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన శివంగికి నటన అంటే చిన్నప్పటి నుంచే ఇష్టమట. అందుకోసమే డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ‘హమారీ సిస్టర్ దిదీ’ సిరియల్ తో బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో కూడా పాల్గోంది. శివంగి డ్యాన్స్ లో గ్రేస్ చూసి ‘బిచ్చగాడు 2’ లో స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాటకు మంచి వ్యూస్ కూడా వచ్చాయి.