Rithika Singh : ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ” రితికా సింగ్ “. నిజ జీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఇరుదుసుట్రు’ చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. హిందీ సినిమా ‘సాలా ఖడూస్’తో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ భామ ఇటీవలే ఇన్ కార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే రితికా సింగ్ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది.