Pranita Subhash: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్రణీత సుభాష్. బావ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అందం, అభినయంతో బాపు బొమ్మ గా పేరు తెచ్చుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ లాంటి సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది లో నటించింది. అయితే ప్రణీత ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. అవకాశాలు కూడా అంతంత మాత్రమే. దీంతో 2021లో బెంగళూరు కు చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ప్రణీత ఫుల్ యాక్టివ్. రీసెంట్ బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.