New Parliament Building: భారత దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా జరిపిన హోమాలు, భక్తి శ్రద్ధలతో చేసిన పూజల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, పలువురు ముఖ్యమంత్రుల, ఎంపీలు, గవర్నర్లు, తమిళనాదు ఆధీనమ్ ల మఠాధిపతులు పాల్గొన్నారు.
ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం(సెంగోల్ ) ను ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రతిష్టించారు. నూతన పార్లమెంట్ భవనం సాధికారత, జ్వలించే స్వప్నాలు సాకారమయ్యేలా చేసే చోటుగా విలసిల్లాలని మోదీ ఆకాంక్షించారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అధునాతల సదుపాయాలు, సకల హంగులతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించిన విషయం తెలిసిందే.