Met Gala 2023: ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలా-2023 లో అందమైన మగువలతో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. మే 1న న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా-2023 వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు మన దేశం నుంచి కూడా పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. వరల్డ్ క్లాస్ టాప్ సెలెబ్రిటీస్ అంతా తమ తమ అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో చూపరులకు కనువిందు చేశారు.
కోట్ల విలువ చేసే దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. దాదాపు 150కి పైగా స్కెచ్‌లతో రూపొందించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌ను ఈసారి మెట్ గాలాలో ముద్దుగుమ్మలు ప్రదర్శించారు. దేవకన్యలా తెల్ల రంగు గౌన్ ధరించిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తొలిసారి ఈవెంట్ లో పాల్గోని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆలియాతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ, నటాషా పూనావాలాలు.. సరికొత్త ఫ్యాషన్లతో రెడ్ కార్పెట్‌పై హొయలుపోయారు.