Hardik Natasha: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కల నెరవేరింది. 2020 కరోనా కాలంలో పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ను చాలా సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. అప్పడు ఉన్న పరిస్థితులను బట్టి పెళ్లిని ఘనంగా నిర్వహించుకోలేకపోయే అనే బాధతో ఈ నెల 14వ తేదీ అనగా ప్రేమికుల దినోత్సవం రోజున తన రెండేళ్ల కొడుకు సమక్షంలో పాండ్యా నటాషా మరల ఘనంగా వివాహం చేసుకుని వారి కలను నెరవేర్చుకున్నారు.