Aishwarya Rajesh: తెలుగు అమ్మాయి అయినా తమిళ ఇండస్ట్రీలో మంచి నటి గా పేరు సంపాదించుకుంది ఐశ్వర్యా రాజేష్. కౌశల్యా కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది. ఇక ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. జీవితంలో ఎన్నో కష్టాలను తాను పడ్డానని.. జీవితం చాలా పాఠాలు నేర్పిందని ఐశ్వర్య రాజేష్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాక ముందు కూడా తనకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయంది ఐశ్వర్య రాజేష్ . స్టార్ హీరోయినా కాకపోయినా.. మంచ నటిగా పేరుతెచ్చుకోవాలని చెప్పుకొచ్చింది. తన సినిమాలు ప్రేక్షకులు మనసులో నిలిచిపోయేలా ఉండాలనుకున్నట్టు తన మనసులో మాట చెప్పింది ఐశ్వర్య. ఇక తాజాగా తమిళంలో ‘ఫర్హానా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది.