Aishwarya Rai Bachchan : ఐశ్వర్య రాయ్.. ఈ మాజీ విశ్వ సుందరిని చూస్తే అందమే అసూయ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. భారతీయ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. కాగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందరి హృదయాలను మరోసారి కొల్లగొట్టింది. కాగా నేడు ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా పార్ట్ 2 రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రమోషన్స్ లో కూడా మంచి యాక్టివ్ గా పాల్గొన్న ఐష్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పీఎస్ 2 లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ సహా పలువురు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు (ఇరువర్) సినిమా తోనే ఐష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.